రామ్ చరణ్ హీరోగా, జాన్వీహీరోయిన్‌గా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పెద్ది”పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తుండగా, విడుదలకు ముందే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి ఫస్ట్ లుక్ వరకు వచ్చిన ప్రతి అంశం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్, సినిమా గ్రామీణ నేపథ్యం, మాస్ ఎలిమెంట్స్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ వంటి అంశాలు ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్‌లో అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిపాయి.

ఇప్పటికే మేకర్స్ ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా జూన్ 3 నుంచే ఓవర్సీస్‌లో ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహిస్తామని కూడా వెల్లడించారు. ఈ ప్రకటనతో విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు భారీగా ఉత్సాహం వ్యక్తం చేశారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలో రామ్ చరణ్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే తాజా పరిస్థితులను గమనిస్తే ఇండియాలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో “పెద్ది” ప్రీమియర్స్‌పై అనుమానాలు మొదలయ్యాయి. మొదట విడుదల చేసిన పోస్టర్లలో “జూన్ 3 ప్రీమియర్స్” అనే అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించిన మేకర్స్, తరువాత వచ్చిన కొన్ని పోస్టర్స్ మరియు ప్రమోషనల్ మెటీరియల్‌లో ఆ విషయాన్ని మెల్లగా పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. దీంతో అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. అసలు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ఉంటాయా? లేక కేవలం ఓవర్సీస్‌కే పరిమితం చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చోటు చేసుకున్న కొన్ని వివాదాలు, బెనిఫిట్ షోలు మరియు ప్రీమియర్స్‌కు సంబంధించిన చర్చలు కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపి ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో భద్రతా అంశాలు, టికెట్ ధరలు, అభిమానుల హడావిడి వంటి అంశాలు ప్రభుత్వ దృష్టిలోకి రావడంతో మేకర్స్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మొదట ప్రణాళికలో ఉన్న ప్రీమియర్స్‌ను ఇప్పుడు రీషెడ్యూల్ చేయాలా? లేక పూర్తిగా రద్దు చేయాలా? అనే దానిపై ఆలోచన జరుగుతోందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం అయితే అధికారికంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌పై స్పష్టత రాకపోయినా, విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం చివరి నిమిషంలో అయినా ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి నిజంగానే “పెద్ది” ఆట జూన్ 3 నుంచే ప్రారంభమవుతుందా? లేక జూన్ 4 రెగ్యులర్ షోలతోనే మొదలవుతుందా? అన్నది త్వరలో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: