మన మెడ చుట్టూ చర్మం నల్లగా ఉండడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్య తలెత్తనప్పటికి ఇది చూడడానికి చాలా అందవిహీనంగా ఉంటుంది. మెడ చుట్టూ నల్లగా ఉండడం వల్ల నచ్చిన బట్టలు వేసుకోలేక చాలా రకాలుగా ఇబ్బందిపడుతూ ఉంటారు. మెడ చుట్టూ చర్మాన్ని తెల్లగా మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఎలాంటి ఖర్చు లేకుండా చాలా సులభంగా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో మెడ చుట్టూ నల్లగా ఉన్న చర్మాన్ని పోగొట్టుకొని చాలా ఈజీగా తెల్లగా మార్చుకోవచ్చు. మెడ చుట్టూ నల్లగా వుండే చర్మాన్ని ఈజీగా తెల్లగా మార్చే ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల కాఫీ పొడిని తీసుకోని ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ పంచదారను వేసుకోవాలి.ఆ తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ మెడ చుట్టూ రాసుకోవాలి.


అయితే మీరు దీనిని రాసుకోవడానికి ముందు మెడను గోరు వెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసుకుని 5 నిమిషాల పాటు సర్క్యులర్ మోషన్ లో బాగా మసాజ్ చేసుకోవాలి.ఈ మిశ్రమం ఆరిన తరువాత నీటితో శుభ్రంగా కడిగి వేయాలి.ఇక ఇలా చేయడం వల్ల మెడ చుట్టూ చర్మంపై ఉండే మురికి ఇంకా మృత కణాలు చాలా ఈజీగా తొలగిపోతాయి.అలాగే ఈ టిప్ పాటించడం వల్ల చర్మంపై ఉండే నలుపు చాలా ఈజీగా తగ్గి చర్మం తెల్లగా మారుతుంది. ఇంకా ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటించడం వల్ల మనం మెడ చుట్టూ ఉండే చర్మాన్ని చాలా ఈజీగా తెల్లగా మార్చుకోవచ్చు. ఈ టిప్ పాటిస్తూనే ప్రతిరోజూ వ్యాయామం కూడా చేయాలి. అధిక బరువు సమస్యని వీలైనంత ఈజీగా తగ్గించుకోవాలి. అలాగే ఖచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాలి. థైరాయిడ్ సమస్య ఖచ్చితంగా అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా మెడ చుట్టూ వుండే నల్లటి చర్మాన్ని ఈజీగా తెల్లగా మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: