కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ అక్టోబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. కొన్ని సంవత్సరాల క్రితం రిషబ్ శెట్టి హీరో గా నటించి దర్శకత్వం వహించిన కాంతారా సినిమా అద్భుతమైన విజయం సాధించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మొదటి నుండి కూడా కాంతారా చాప్టర్ 1 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ మూవీ ఇప్పటికే నార్త్ అమెరికాలో రేర్ మార్క్ కలెక్షన్లను టచ్ చేసింది. తాజాగా ఈ మూవీ బృందం అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ కాంతారా చాప్టర్ 1  మూవీ నార్త్ అమెరికాలో 1 మిలియన్ ప్లస్ కలెక్షన్లను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. 

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ మూవీ పై మొదటి నుండి కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: