ఇక మన జుట్టు సమస్యలన్నింటిని నెల రోజుల్లో దూరం చేసి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేసే టిప్ గురించి తెలుసుకుందాం. ఇక ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా మనం ప్రధానంగా మెంతులను తీసుకొని వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే వాటితో పాటు పెరుగును, బాదం నూనెను, విటమిన్ ఇ క్యాప్పుల్స్ ను ఇంకా అలాగే కలబంద గుజ్జును కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక ముందుగా మన జుట్టుకు సరిపోయేటన్నీ మెంతులను తీసుకుని వాటిని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మెంతులను జార్ లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి.ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె, 2 విటమిన్ ఇ క్యాప్సుల్స్ ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును వేసి బాగా కలపాలి.అప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిపోతుంది.


ఆ తరువాత ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మనం ఈజీగా జుట్టు రాలడాన్ని  తగ్గించుకోవచ్చు. ఈ టిప్ ని వాడడం వల్ల జుట్టు కుదుళ్ల ధృడంగా తయారవ్వడానికి కావల్సిన పోషకాలన్నీ కూడా చాలా ఈజీగా అందుతాయి. జుట్టు రాలడం తగ్గి జుట్టు బాగా ఒత్తుగా కూడా పెరుగుతుంది.ఇంకా అలాగే బట్టతల సమస్య కూడా తలెత్తకుండా ఉంటుంది. పెరగడం ఆగిన జుట్టు కూడా పొడవుగా ఇంకా ఒత్తుగా పెరుగుతుంది.ఇక ఈ విధంగా ఈ టిప్ పాటించడం వల్ల జుట్టు అందంగా, ఒత్తుగా, మృదువుగా ఇంకా అలాగే పట్టుకుచ్చులాగా తయారవుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని ట్రై చెయ్యండి. నెల రోజుల్లో జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలకు చాలా ఈజీగా చెక్ పెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి: