చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్​. చైనాతో సరిహద్దు వాస్తవాదీన రేఖను ఏకపక్షంగా మార్చడానికి చేసే ఏ ప్రయత్నాన్ని భారత్​ అంగీకరించదని ఉద్ఘాటించారు. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని గౌరవిస్తూ.. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ప్రయత్నించాలన్నారు.



సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంత వాతావరణం భారత్​-చైనాల మధ్య విస్తృత సహకారానికి ఆధారంగా నిలిచాయని.. అయితే కరోనా వల్ల సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. ఆల్​ ఇండియా రేడియోలో ప్రసారమైన సర్దార్​ పటేల్​ మెమోరియల్​లో ప్రసంగించారు జైశంకర్.వారసత్వంగా వచ్చిన సవాళ్లను, కొత్త పరిస్థితులను పరిష్కరించడం వల్లే మూడు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: