
అక్టోబర్ 2 వరకు సెలవులు ఇచ్చి మూడవ తేదీన తిరిగి క్లాసులకు హాజరు కావాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కానీ ఊర్లకు వెళ్లినవారు పండుగ రోజు రాత్రికి రాత్రి ఎలా బయలుదేరి వస్తారంటూ విద్యార్థిని తల్లితండ్రులు , అటు ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో దసరా సెలవులను పొడిగించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఇచ్చినటువంటి ఈ దసరా సెలవులను మరో రెండు రోజులపాటు పొడిగించాలంటూ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
అక్టోబర్ 4, 5 తేదీన సెలవులుగా పొడిగించి రెండవ శనివారం పని దినంగా ప్రకటిస్తే బాగుంటుందంటూ సూచిస్తున్నారు. అంతేకాకుండా ఒకేరోజు ఇలా విద్యార్థులు, టీచర్లు, ఇతర ఉద్యోగస్తులు బయలుదేరితే కచ్చితంగా ప్రయాణంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని తల్లితండ్రులు తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయం పైన ఎలాంటి నిర్ణయం తెలుపలేదు. విద్యార్థుల సెలవులు పొడిగింపు పైన మాత్రం వినతి పత్రాలు అందుతూనే ఉన్నాయి. ఇటీవల సెలవులు పొడిగింపు విషయంలో కూడా టీచర్ ఎమ్మెల్సీ వినతి మేరకు రెండు రోజులు ముందుగానే పొడిగించి సెలవులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.