గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా జరుగుతుంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా పోలీసు ఉన్నతాధికారులు ఉదయాన్నే పోలింగ్ బూతులకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలను కూడా ఓటు వేయాలని కోరుతున్నారు. సినీ ప్రముఖులు
నాగార్జున,
మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఓటు వేశారు. ఉదయం
జూబ్లీహిల్స్ క్లబ్ కు చేరుకున్న
చిరంజీవి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నాంపల్లిలో సీపీ సజ్జనార్, కుందన్ బాగ్ లో రాచకొండ సీపీ
మహేష్ భగవత్, ఎఫ్‌ఎన్‌సీసీలో
రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓటేసారు. మంత్రులు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు 12 శాతం పోలింగ్ నమోదు అయింది
హైదరాబాద్ లో. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ విషయంలో దుమారం రేగుతుంది. పరిస్థితి అదుపులోనే ఉంది.
మంత్రి కేటిఅర్ కూడా ఓటు వేసారు.