దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రభాకర్ ను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేసారు. నిన్న రాత్రి పెదవేగి మండలం బి. సింగవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చింతమనేని... ఒక వివాదంలో ఉన్నారనే కారణంతో అరెస్ట్ చేసారని సమాచారం. ఆయన తిరిగి స్వగ్రామం చేరుకున్నాక,  బి. సింగవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య వివాదం , ఘర్షణ జరిగింది.

కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ ఐ ఆర్ లో చింతమనేని ప్రభాకర్ పేరు చేర్చి,  హడావుడిగా అరెస్టు చేసారు. పోలీసుల వైఖరిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసుతో సంబంధం లేకపోయినా ప్రభాకర్ ను అరెస్టు చేసారని మండిపడుతున్నారు. అయితే ఆయనను ఇంకా కోర్ట్ లో హాజరు పరచలేదని తెలిసింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: