భార‌త వైమానిక ద‌ళం  శుక్ర‌వారం 89వ వార్షికోత్స‌వాల‌ను జ‌రుపుకున్న‌ది.  ఢిల్లీ స‌మీపంలోని హిండ‌న్ అబ్బుర ప‌రిచే విమాన విన్యాసాల‌కు వేదికైంది.  భార‌త ఎయిర్ ఫోర్స్ అద్భుత విన్యాసాల‌ను చేప‌ట్టింది.ఫ్లాగ్‌బేరింగ్‌, స్కై డ్రైవ‌ర్ డ్రాప్ అవుట్ అవ్వ‌డంతో ఈ ప్ర‌ద‌ర్శ‌న మొద‌లైంది. అనంత‌రం ప్లైఫాస్ట్‌లో హెరిటేజ్ ఎయిర్‌క్రాప్ట్‌, ఆధునిక ట్రాన్స్‌ఫోర్ట్ ఎయిర్ క్రాప్ట్‌, ట్రంప్‌లైన్ ఫైట‌ర్ ఎయిర్ క్రాప్ట్‌తో ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. గ‌గ‌న త‌లంలోకి ర‌య్ ర‌య్ మంటూ ఆకాశంలోకి దూసుకెళ్లాయి.  అంద‌రినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఎయిర్‌బేస్‌లో ర‌ఫెల్‌, తేజ‌స్ వంటి యుద్ధ‌విమానాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసాలు అంద‌రినీ అబ్బూర ప‌రిచాయి. సాధార‌ణంగా ప‌క్షులు ఎగురుతున్న‌ప్పుడు విమానాల‌కు తీవ్ర ముప్పు ఉంటుంది. విమానాలు కిందిస్థాయిలో తిరుగుతున్న‌ప్పుడు ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఈ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా  కొద్ది రోజుల ముందే ఎయిర్ బేస్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో తినుబండ‌రాలు, చెత్త‌, చెదారాన్ని వేయ‌వ‌ద్ద‌ని భార‌త వైమానిక ద‌ళం ప్ర‌జ‌ల‌కు సూచించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: