ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఇవాళ ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగుతాయి. ముఖ్యంగా శాస‌న‌మండ‌లి, శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల కొన‌సాగడంతో పాటు సినిమా రెగ్యుల‌రైజేష‌న్ యాక్ట్తో పాటు ప‌లు కీల‌క బిల్లుల‌ను ఆమోదించ‌నున్నారు. అదేవిధంగా బీసీ జ‌న‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని అసెంబ్లీలో తీర్మాణం చేప‌ట్ట‌నున్నారు. శాస‌న‌మండ‌లి ర‌ద్దు   చేయాలనే గత తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటూ మంగ‌ళ‌వారం తీర్మాణం చేసే అవకాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇవాళ శాస‌న మండ‌లి ముందుకు ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ ఉప‌సంహ‌ర‌ణ బిల్లు రానున్న‌ది. నిన్న అసెంబ్లీలో ఏపీ ఆర్థిక‌ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్రవేశ‌పెట్టిన విష‌యం విధిత‌మే. అదేవిధంగా రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్‌, డిజీల్ గురించి కూడా చ‌ర్చించే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది.
ఇంధన శాఖ లో సంస్కరణలపై మండలి లో చర్చ కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది. వీటితో పాటు ముఖ్యంగా 15 బిల్లుల‌ను అసెంబ్లీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ది.  ఈ 15 కీల‌క బిల్లులను ఆమోదించ‌నున్న‌ట్టు స‌మాచారం.  ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆరోగ్యశ్రీ నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర వైద్యరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. అదేవిధంగా  కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్టు మంత్రి వెల్ల‌డించారు. ఆరోగ్యశ్రీ ద్వారా మొత్తం 2446 వ్యాధులకు చికిత్స అందిస్తున్నామని వివ‌రించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: