ప్ర‌పంచ వ్యాప్తంగా ఇక్క‌డ‌.. అక్క‌డ అని తేడా లేకుండా నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకూనే ఉంటున్నాయి. కొన్ని చోట్ల స్వ‌ల్పంగా గాయాలు.. మ‌రికొన్ని చోట్ల మ‌ర‌ణించ‌డంతో పాటు మృత‌దేహాలు చెల్ల‌చెదురై పోతుంటాయి. తాజాగా సెంట్ర‌ల్ మెక్సికోలో యాత్రికుల‌తో వెళ్లుతున్న ఓ బ‌స్సు ఘోర ప్ర‌మాదానికి గురైన‌ది. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 19 మంది వ‌ర‌కు మృతి చెందారు. మ‌రో 32  మంది గాయాలు పాలు అయి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం తెలుస్తుంది.

మెక్సికో సిటీలోని జోక్విసింగో టౌన్‌షిప్‌లో ఈ ఘోర ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. బ‌స్సు అధిక వేగంతో వెళ్ల‌డం.. అందులో బ్రేకులు ఫెయిల్ కావ‌డంతో ప్ర‌మాదానికి గురైన‌ట్టు అక్క‌డి అధికారులు ధృవీక‌రించారు. డిసెంబ‌ర్ 12న జ‌రుపుకునే వ‌ర్జిన్ ఆఫ్ గ్వ‌డెలోప్ స‌మీపిస్తున్న త‌రుణంలో మెక్సిక‌న్లు పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శిస్తుంటారు.  ఈ నేప‌థ్యంలోనే మిచోకాన్ ప్రాంతం నుండి రోమ‌న్ క్యాథ‌లిక్ యాత్రికులు సంద‌ర్శించే చ‌ల్మా ప‌ట్టానికి  వెళ్ల‌డానికి ఈ బ‌స్సు బ‌య‌లుదేరింది. అక్క‌డ ఇరుకైన రోడ్డు ఉండ‌డం.. కాలం చెల్లిన బ‌స్సులో ప్ర‌యాణించ‌డం మూలంగానే త‌రుచూ ఇక్క‌డ ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయ‌ని అధికారులు వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: