మెక్సికో సిటీలోని జోక్విసింగో టౌన్షిప్లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. బస్సు అధిక వేగంతో వెళ్లడం.. అందులో బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదానికి గురైనట్టు అక్కడి అధికారులు ధృవీకరించారు. డిసెంబర్ 12న జరుపుకునే వర్జిన్ ఆఫ్ గ్వడెలోప్ సమీపిస్తున్న తరుణంలో మెక్సికన్లు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మిచోకాన్ ప్రాంతం నుండి రోమన్ క్యాథలిక్ యాత్రికులు సందర్శించే చల్మా పట్టానికి వెళ్లడానికి ఈ బస్సు బయలుదేరింది. అక్కడ ఇరుకైన రోడ్డు ఉండడం.. కాలం చెల్లిన బస్సులో ప్రయాణించడం మూలంగానే తరుచూ ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు.