త‌మిళ‌నాడులోని చోటు చేసుకున్న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై ఇవాళ లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు.  ఈ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో 13 మంది మ‌ర‌ణించారు అని.. ముఖ్యంగా సీడీఎస్ బిపిన్ రావత్, ఆయ‌న భార్య మ‌ధులిక రావత్ ల‌తో పాటు 11 మంది దుర్మ‌ర‌ణం చెంద‌డం బాధ‌క‌ర‌మ‌ని ప్ర‌క‌టించారు రాజ్‌నాథ్ సిగ్‌. ఈ హెలికాప్టర్ ప్రమాదం పై… లోక్ సభ, రాజ్య‌స‌భ‌లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన చేసారు. సుల్లూరు ఎయిర్ బేస్ నుంచి నిన్న.. ఉదయం 11:48 గంటలకు హెలి కాప్టర్ టేకాఫ్ అయిందని.. మధ్యాహ్నం 12:15 గంటలకు వెల్లింగ్టన్ లో ల్యాండ్ కావాల్సి ఉందని ప్ర‌క‌టించారు. అయితే మధ్యాహ్నం 12:08 గంటలకు సుల్లూరు ఏటీపీ విమానానికి కాంటాక్ట్ తెగిపోయిందని రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేసారు రాజ్‌నాథ్ సింగ్‌.

హెలికాప్ట‌ర్ కూలిపోవ‌డాన్ని త‌మిళ‌నాడు స్థానికులు గ‌మ‌నించారు. గాయ‌ప‌డ్డ‌వారిని స‌హాయ‌క బృందాలు వెల్లింగ్ట‌న్ ఆసుప‌త్రికి త‌ర‌లించాయి. ఈ ప్ర‌మాదంపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని వెల్ల‌డించారు రాజ్‌నాథ్ సింగ్‌. ఇప్ప‌టికే హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై విచార‌ణ ప్రారంభ‌మైన‌ద‌ని తెలిపారు. బిపిన్ రావ‌త్ వెల్లింగ్ట‌న్ వెళ్లుతుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ద‌ని రాజ్‌నాథ్ సింగ్ పార్ల‌మెంట్‌లో వెల్ల‌డించారు. మ‌రోవైపు ఇప్ప‌టికే సీడీఎస్ బిపిన్ రావ‌త్ దంప‌తుల‌తో పాటు 11 మంది ఆర్మీ అధికారులు, సిబ్బంది పార్థివ‌దేహాల‌ను రోడ్డు మార్గం ద్వారా సుల్లూరు ఎయిర్‌బేస్‌కు త‌ర‌లించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: