ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉద్యోగుల మ‌ధ్య పీఆర్‌సీ ర‌గ‌డ కొన‌సాగుతున్న‌ది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌ల‌పెట్టిన ఛ‌లో విజ‌య‌వాడ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. గురువారం రోజు అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ఉద్యోగుల‌కు సెల‌వు ఇవ్వ‌వద్దు అని అధికారులు జిల్లా క‌లెక్ట‌ర్లు ఆదేశాలు జారీ చేసారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసారు. మ‌రొక‌వైపు ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు ఉద్యోగులు సిద్ధం అవుతున్నారు. ఇప్ప‌టికే చాలా మంది విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. ఉద్యోగ సంఘం నేత‌ల‌ను హౌస్ అరెస్ట్ చేయ‌డానికీ పోలీసులు కూడా య‌త్నిస్తున్నారు.

ఉద్యోగులంద‌రినీ అరెస్ట్ చేసినా.. 10 మందితో అయినా ఛ‌లో విజ‌య‌వాడ నిర్వ‌హించి తీరుతాం అని పీఆర్‌సీ సాధ‌న స‌మితినేత బండి శ్రీ‌నివాస్ రావు స్ప‌ష్టం చేసారు. అంత‌కుముందు విజ‌య‌వాడ సీపీ కాంతిరాణా టాటాను క‌లిసేందుకు వెళ్లిన పీఆర్‌సీ సాధ‌న స‌మితి నేత‌ల‌కు చుక్కఎదురైంది. ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి ఇవ్వాల‌ని కోర‌డానికి విజ‌య‌వాడ సీపీ కార్యాల‌యానికి స‌మితి నేత‌లు వెళ్లారు. అయితే వారితో మాట్లాడి.. ఏడీసీపీ ర‌మ‌ణ‌మూర్తి వెన‌క్కి పంపారు. తాము సీపీని క‌లువ‌డానికి రాలేదు అని.. ఇప్ప‌టివ‌ర‌కు త‌మ‌కు స‌హ‌కారమందించ‌నందుకు ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డానికి వ‌చ్చాం అని పీఆర్సీ సాధ‌న స‌మితి ప్ర‌తినిధి సూర్య‌నారాయ‌ణ వెల్ల‌డించారు. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా విజ‌య‌వాడ సీపీ స‌హ‌కారం అందించ‌లేకున్నా ఆయ‌న మ‌న‌స్సు త‌మ‌తోనే ఉంద‌ని వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: