ఉద్యోగులందరినీ అరెస్ట్ చేసినా.. 10 మందితో అయినా ఛలో విజయవాడ నిర్వహించి తీరుతాం అని పీఆర్సీ సాధన సమితినేత బండి శ్రీనివాస్ రావు స్పష్టం చేసారు. అంతకుముందు విజయవాడ సీపీ కాంతిరాణా టాటాను కలిసేందుకు వెళ్లిన పీఆర్‌సీ సాధన సమితి నేతలకు చుక్కఎదురైంది. ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరడానికి విజయవాడ సీపీ కార్యాలయానికి సమితి నేతలు వెళ్లారు. అయితే వారితో మాట్లాడి.. ఏడీసీపీ రమణమూర్తి వెనక్కి పంపారు. తాము సీపీని కలువడానికి రాలేదు అని.. ఇప్పటివరకు తమకు సహకారమందించనందుకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చాం అని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి సూర్యనారాయణ వెల్లడించారు. విధి నిర్వహణలో భాగంగా విజయవాడ సీపీ సహకారం అందించలేకున్నా ఆయన మనస్సు తమతోనే ఉందని వెల్లడించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి