భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ శ‌నివారం హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింత‌ల్‌లో రామానుజాచార్య స‌హ‌స్రాబ్ది వేడుక‌ల‌తో పాటు ప‌టాన్ చెరు ఇక్రిశాట్ స్వ‌ర్ణోత్స‌వాల్లో ప్ర‌ధాని పాల్గొన‌నున్నారు.  శ‌నివారం మ‌ధ్యాహ్నం 2.10 గంట‌ల‌కు ఢిల్లీ నుంచి ప్ర‌త్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్‌కు చేరుకోనున్న ప్ర‌ధాని మోదీకి రాష్ట్ర ప‌శుసంవ‌ర్థ‌క, మ‌త్య్స, పాడి ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధి శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌శ్ స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు.

అదేవిదంగా ప‌ర్య‌ట‌న పూర్త‌యిన త‌రువాత ప్ర‌ధానికి వీడ్కోలు చెప్పే బాధ్య‌త‌ల‌ను కూడా ఆయ‌న నిర్వ‌ర్తించ‌నున్నారు. దీనికి సంబంధించి తాజాగా సీఎం కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. సాధార‌ణంగా ప్ర‌ధాని ఏ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వెళ్లినా ఆ రాష్ట్రం యొక్క ముఖ్య‌మంత్రి వెళ్లి స్వాగ‌తం ప‌ల‌క‌డం సంప్ర‌దాయం. అయితే శ‌నివారం న‌గ‌రానికి రానున్న ప్ర‌ధాని మోదీకి స్వాగ‌తం చెప్పేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెళ్ల‌కుండా రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌ను పంప‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: