ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు అధికారులకు ఏకంగా జైలు శిక్ష, జరిమానా విధించింది. రాజంపేట సబ్‌ కలెక్టర్‌ గా పని చేసిన కేతన్ గార్గ్, ఏపీఎండీసీ సీపీవోగా పనిచేసిన ఎం సుదర్శన్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు 6 నెలలు జైలు శిక్ష, రూ.2 వేలు చొప్పున జరిమానా ఇద్దరికీ వేరు వేరుగా విధించింది. అసలేం జరిగిందంటే.. ఓబులవారి పల్లె మండలం, మంగంపేట గ్రామానికి చెందిన నరసమ్మ ఇంటిని దాదాపు 20 ఏళ్ల క్రితం మైనింగ్‌లో భాగంగా తీసుకున్నారు. అయితే.. పరిహారం మాత్రం చెల్లించలేదు. దీంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారించిన హైకోర్టు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.


అయితే కోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు.. బాధితురాలి ఇంటి కొలతలు లేవన్న సాకుతో పరిహారం ఇవ్వలేదు. దీంతో ఆమె ఈసారి కోర్టు ధిక్కరణ పిటీషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు రాజంపేట సబ్ కలెక్టర్, ఏపీఎండీసీ సీపీవోకు 6 నెలలు జైలు శిక్ష, 2వేలు చొప్పున జరిమానా విధించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు విధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: