పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. అందుకే సాయం కోసం విదేశాలవైపు చూస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్‌కు ఇప్పుడు తోటి ముస్లిం దేశం సౌదీ అరేబియా ఆపన్న హస్తం అందించింది. పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 8 బిలియన్‌ డాలర్ల సాయం అందించేందుకు సౌదీ అరేబియా అంగీకరించింది. ఇప్పటికే పాక్ విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. అధిక ద్రవ్యోల్బణంతో పాటు అనేక ఇతర  ఆర్థిక సవాళ్లను పాక్‌ ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో సౌదీ ప్రభుత్వం పాకిస్తాన్ కు భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇటీవల సౌదీ అరేబియాలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ పర్యటించారు. ఆ సమయంలో ఆర్థిక సాయంపై అక్కడి ప్రభుత్వంతో చర్చించారు. దాని ఫలితంగానే ఇప్పుడు సౌదీ అరేబియా పాక్‌ను అందుకునేందుకు ముందుకు వచ్చింది. చమురు ఉత్పత్తుల వాణిజ్యానికి సౌదీ ఇప్పటికే 1.2 బిలియన్ల ఆర్థిక సాయం చేస్తోంది. దీన్ని ఇప్పుడు 4.2 బిలియన్లకు పెంచాలని సౌదీ నిర్ణయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: