ఏపీ సీఎం జగన్‌ రైతుల ఖాతాల్లో డబ్బులు వేయబోతున్నారు. ఈ నెల 16 న రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే జూన్ 15 లోగా రైతులకు పంటల బీమా పరిహారం డబ్బులు కూడా ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఖరీఫ్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సన్నంద్దంగా ఉండాలని ఆదేశించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు కొరత రాకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎెం జగన్ నిర్దేశించారు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖలపై జరిపిన  సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు.  రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏఓ చాంఫియన్‌ అవార్డుకు ఎంపికైనందుకు వ్యవసాయ శాఖ అధికారులను సీఎం అభినందించారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో వ్యవసాయ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: