వైసీపీ తరఫున తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి లను రాజ్యసభకు ఎంపిక చేయడం ఆంధ్రప్రదేశ్‌లోని అనేక వర్గాల్లో అసంతృప్తి కలిగిస్తోంది. ఏపీలో రాజ్యసభకు ఎంపిక చేసేందుకు అర్హులే లేరా అంటూ విశాఖలోని ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆందోళన నిర్వహించింది. విశాఖలోని గురు ద్వారా సమీపంలో నిరసన ప్రదర్శన నిర్వహించింది.

ఆంధ్ర ప్రదేశ్‌లో అనేక మంది బీసీలు ఉంటే.. వారిని కాదని తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్యలకు రాజ్యసభ సీటు ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాష్ట్రంలో ఉన్న బీసీలను అవమానపరచడమే అని ఏపీ నిరుద్యోగ జేఏసీ నాయకులు అంటున్నారు. రాజ్య సభ కు వెళ్తున్న ఆ ఇద్దరు, తెలంగాణలో కనీసం ఒక ఉద్యోగమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులకు ఇప్పించగలరా అని వారు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు చిడతలు వాయిస్తూ నిరసన తెలిపారు. నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్యలకు పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డీ.. మరి మా సంగతి ఏంటి అంటూ వారు చిడతలు వాయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: