తెలంగాణ కాంగ్రెస్‌లో కొట్లాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి మధ్య యుద్ధం కొనసాగుతోంది. యశ్వంత్ సిన్హాను ఆహ్వానించే విషయంలో మరోసారి మొదలైన యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో ఇవాళ సంచలన ప్రకటన చేయబోతున్నానని జగ్గారెడ్డి నిన్న ప్రకటించారు. రాజకీయ యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలన్న జగ్గారెడ్డి.. రేవంత్‌రెడ్డి అందరి ఆలోచనలతో ముందుకెళ్లాలన్నారు. కానీ.. రేవంత్‌ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తున్నారని.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆలోచన చేయాలని జగ్గారెడ్డి అన్నారు.


గతంలో విభేదాలపై రేవంత్‌ వర్గం అధిష్ఠానానికి ఫిర్యాదు చేశానని.. గతంలో దిల్లీలో సీనియర్ నేతలతో రాహుల్‌ భేటీ జరిగిందని.. రాహుల్‌తో భేటీ తర్వాత మేము ఇప్పటివరకు మాట్లాడలేదని జగ్గారెడ్డి అన్నారు. పార్టీ నేతల గురించి మాట్లాడబోనని రాహుల్‌కు మాట ఇచ్చానని.. కానీ ఆ మాట ఇచ్చి తప్పినందుకు బాధపడుతున్నానని జగ్గారెడ్డి అన్నారు. యశ్వంత్‌ పర్యటన విషయమై మాతో రేవంత్ మాట్లాడలేదని.. ఎంపీ, ఎమ్మెల్యేలతో చర్చించినట్లు మీడియా ముందుకు చెప్పారని.. నేను మీడియా ముందు మాట్లాడే పరిస్థితి తెచ్చిందే రేవంతేనని జగ్గారెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: