బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్‌ అనుమానాస్పద మృతిని పోలీసులు హత్యగా భావిస్తున్నారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. సోనాలి ఫోగట్‌ సహాయకులు సుధీర్‌ సగ్వాన్‌, సుఖ్విందర్‌ వాసిలను అరెస్ట్‌ చేశారు. సోనాలి ఫోగట్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు సోనాలి ఫోగట్‌ శరీరంపై పలుచోట్ల మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు తెలిపారు.


ఈ మేరకు పోస్టుమార్టం నివేదికలో వివరాలు పేర్కొన్నారు. సోనాలి వెంట గోవా వెళ్లిన ఇద్దరు సహాయకులే ఆమెను హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు మృతురాలి సోదరుడు రింకు ధాక పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. చనిపోవటానికి ముందు సోనాలి తన తల్లి, సోదరి, బావతో మాట్లాడిందట. సోనాలి ఫోగట్‌ ఫోన్ మాటల్లో ఆందోళన కనిపించిందట. అంతే కాదు. ఆమె తన ఇద్దరు సహాయకులపై ఫిర్యాదు కూడా చేసిందట. సోమవారం రాత్రి గోవాలో చనిపోయిన సోనాలి ఫోగట్‌ను మంగళవారం ఉదయం ఉత్తర గోవా జిల్లాలోని సెయింట్‌ ఆంటోనీ ఆస్పత్రికి తరలించారు. అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: