ఎయిడ్స్  రాకుండా నియంత్రించటంలో కొత్తగా వచ్చిన ప్రెప్ మందులు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రెప్ వినియోగం గురించి గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని పాల్గొన్నారు. ఈ ప్రెప్ మందులకు సంబంధించిన ప్రచార సామాగ్రిని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆవిష్కరించారు.


ఎయిడ్స్ కి గురయ్యేందుకు ఎక్కువగా అవకాశమున్న వారు ముందుగానే ఈ మందుల్ని తీసుకోవటం ద్వారా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని అంటున్నారు. సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుని ఈ మందులను అవసరమైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని  తెలిపారు. ఎయిడ్స్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల్లో ప్రెప్ ని కూడా చేరుస్తామని మంత్రి తెలిపారు. లైంగిక సంబంధాలు నిర్వహించే వారు హెచ్ఐవి రాకుండా ముంద జాగ్రత్తగా ఇవి వాడొచ్చని అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: