జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో కదలిక వస్తోంది. సార్వత్రిక ఎన్నికల కోసం ఆ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యావసరాలపై జీఎస్టీ పెంపు వంటి అంశాలపై కాంగ్రెస్‌ పోరాటానికి రెడీ అవుతోంది. భాజపా సర్కార్‌ తీరును నిరసిస్తూ ఇవాళ దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ సభను నిర్వహించబోతోంది. మెహంగాయి పర్ హల్లా బోల్ పేరుతో ఈ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు.


ఈ కార్యక్రమానికి దిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ 3500 కిలోమీటర్ల భారత్‌ జోడో యాత్రకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ్టి సభ.. అందుకు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. వైద్యం కోసం విదేశాలకు వెళ్లిన సోనియా గాంధీ, ఆమెతో పాటు ఉన్న ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ మాత్రం ఇవాళ్టి సభకు రావడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: