కుల, మతాలకు అతీతంగా ప్రతి ఏటా దసరా మరుసటి రోజు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహిస్తారు. అలాంటి అలాయ్ బలాయ్ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం రెడీ అయ్యింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో బండారు దత్తాత్రేయ 17ఏళ్ల కిందట అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇవాళ్టి అలాయ్ బలాయ్ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన, కేరళ గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్, పంజాబ్ ముఖమంత్రి భగవంత్ మాన్‌ సింగ్, కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా రానున్నారు. ఇంకా తెలంగాణ మంత్రులు మహమ్మద్ అలీ,తలసాని శ్రీనివాస్ యాదవ్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి ,ఈటల రాజేందర్, కోదండరాం కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా భాగ్యనగరంలో నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: