గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష తుది సమాధానాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అభ్యంతరాలపై నిపుణుల కమిటీ సిఫారసు మేరకు గ్రూప్‌ వన్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఐదు ప్రశ్నలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలిగించింది. మరో రెండు ప్రశ్నలకు రెండు కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 107వ ప్రశ్నకు  సమాధానం ఏదైనా మార్కు వేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

వివిధ విభాగాల్లో 503ఉద్యోగాల భర్తీ కోసం జరిగిన గ్రూప్‌ వన్‌ పరీక్షకు మొత్తం  2 లక్షల 86 వేల 51 మంది హాజరయ్యారు. గత నెల 29న ప్రాథమిక సమాధానాలు ప్రకటించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్..గత నెల 31 నుంచి నవంబరు 4 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత ఐదు ప్రశ్నలను తొలిగించి.. తుది కీ విడుదల చేసింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నియామక పరీక్ష ప్రాథమిక కీని కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈనెల 20 వరకు అభ్యంతరాలను ఆన్ లైన్‌లో సమర్పించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: