సంక్రాంతి నాటికి ఏపీలో 176 స్కిల్ హబ్ ల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు.స్కిల్ హబ్ లు, కాలేజీల పురోగతిపై మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 66 స్కిల్ హబ్ ల ఏర్పాటు చేసి ప్రస్తుతం 2,400 మందికి శిక్షణ అందిస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. మిగిలిన 111 స్కిల్ హబ్ ల ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఆదేశించారు.

ప్రతి స్కిల్ హబ్ లో 2 కోర్సుల చొప్పున మొత్తం 222 కోర్సులలో శిక్షణకు సన్నద్ధంగా ఉండాలని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి సూచించారు. 176 స్కిల్ హబ్ లు అందుబాటులోకి తీసుకువచ్చి 10 వేల మందికిపైగా యువతకు నైపుణ్య, శిక్షణ అందించాలని మంత్రి బుగ్గన నిర్ణయించారు. ఏపీఎస్ఎస్డీసీ లోగో డిజైన్ ను మంత్రి పరిశీలించారు. స్కిల్ కాలేజీలు ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ లు, ల్యాబ్, ట్రైనర్ వంటి అంశాలపై  మంత్రి బుగ్గన చర్చించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: