మానవుడి స్వార్థం, అత్యాధునిక జీవన శైలి కారణంగా.. భూమి నాశనం అవుతోంది. కోట్ల ఏళ్ల నుంచి పచ్చగా విలసిల్లిన భూమి ఇప్పుడు ప్రమాదంలో పడింది. ప్రపంచంలో 80శాతం వ్యర్థజలాలను నేరుగా నదులు, సముద్రాల్లోకి విడిచిపెడుతున్నారు. గత శతాబ్ద కాలంలో చిత్తడినేలలు, పగడపు దిబ్బలు 50శాతం అంతరించిపోయాయన్న వాస్తవం భయపెడుతోంది. మరోవైపు వాయు కాలుష్యం పెచ్చరిల్లింది కూడా.


దీని కారణంగా ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటోంది. పెరుగుతున్న భూతాపం వివిధ రూపాల్లో నష్టం కలిగిస్తోంది. తరచూ కార్చిచ్చులు వస్తున్నాయి.  సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుతోంది.  కరవు కాటకాలు, తుపానులు, వేడి గాలులు పెరిగాయి. వాతావరణ వైపరీత్యాలు ప్రపంచ దేశాలను పీడిస్తున్తనాయి. ఐరాస అంచనా మేరకు గత దశాబ్ద కాలంలోనే ఉష్ణోగ్రత సగటున ఒక డిగ్రీ సెల్సియస్‌ పెరిగింది. భూతాపం మరో 0.5 డిగ్రీలు అధికమైతే ప్రకృతి వైపరీత్యాలు ఇంకా దారుణంగా విరుచుకుపడతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: