జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 27న తాడేపల్లి మండలం ఇప్పటం వస్తున్నారు. ఈ  గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి పార్టీ తరపున పరిహారం అందిస్తారు. ఈనెల 4వ తేదిన ఇప్పటం గ్రామంలో అధికారులు రహదారి విస్తరణ పేరిట ఇళ్లు, ఇతర నిర్మాణాలను తొలగించిన సంగతి తెలిసిందే. రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి రూ.లక్ష చొప్పున పవన్ కల్యాణ్ పరిహారం ప్రకటించారు.


ఆ పరిహారాన్ని స్వయంగా అందించేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఆయనే స్వయంగా ఇప్పటం వెళ్లి పరిహారం అందించే అవకాశం లేకపోతే... బాధితులను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించి పరిహారం అందిస్తారు. పవన్ పరిహారం ప్రకటించిన తర్వాత తమకు అవేమీ వద్దని వైసీపీకి చెందిన కొందరు ఫ్లెక్సీలు కట్టారు కూడా. దీంతో పరిహారం ఎందరికి ఇవ్వాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఎవరైతే పరిహారం తీసుకునేందుకు అంగీకరిస్తారో వారికి ఇవ్వాలని జనసేన భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: