తెలంగాణ గవర్నర్ తమిళిసై కూ సీఎం కేసీఆర్‌ కూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళిసైకు కేసీఆర్ మరో షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకూ యూనివర్శిటీలకు ఛాన్సలర్‌గా గవర్నర్‌ ఉంటూ వస్తున్నారు. ఇది సాంప్రదాయంగా వస్తోంది. కానీ.. విశ్వవిద్యాలయాల ఛాన్స్‌లర్‌గా గవర్నర్‌ను తప్పించే చట్ట సవరణ బిల్లును తీసుకొస్తారని తెలుస్తోంది.

అలాగే..  పెండింగ్ లో ఉన్న బిల్లులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను కోరుతూ..... మంత్రివర్గం ఓ తీర్మానం చేసే అవకాశం కూడా ఉందట. దీంతో గవర్నర్ వర్సస్‌ సీఎం ఇష్యూ మరింత హాట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ పేరు భారాసగా మారిన తరుణంలో లక్ష్యాలు, కార్యాచరణపై సీఎం కేసీఆర్ ఇవాల్టి కేబినెట్ మీటింగ్‌లో మంత్రులకు  దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎన్నికలు రాబోతున్న సమయంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే కార్యాచరణపైనా సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: