విపక్షంలో ఉంటే ఏమైనా డిమాండ్‌ చేయవచ్చని కొందరు నేతలు భావిస్తున్నట్టు కనిపిస్తున్నారు. తాజాగా పింఛన్లలో దొంగనోట్లు పంపిణీ చేశారని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతోందని... దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలని టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు డిమాండ్‌ చేశారు. పేదలకు ఇచ్చే పెన్షన్లలో దొంగనోట్లు పంపిణీ దుర్మార్గమని టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ. నాయుడు మండిపడ్డారు.

మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గంలోని నరసాయపాలెంలో అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని వాలంటీర్లతో దొంగనోట్లు పంపిణీ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ. నాయుడు  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క యర్రగొండపాలెంలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందన్న టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ. నాయుడు .. దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో 54,06,008 మందికి పెన్షన్ ఇచ్చామని.... కానీ 39 లక్షలేనని సీఎం చెప్పడం సరి కాదని టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ. నాయుడు  విమర్శించారు. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2 వేల చేసిన ఘనత చంద్రబాబుదని టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ. నాయుడు  గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: