విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని కనకదుర్గ ఆలయాన్ని కార్పరేషన్ అధికారులు విగ్రహాలను తొలగించి జెసిబి తో ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. దీనిపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధ్వంసం చేసిన దేవాలయాన్ని ఆయన పరిశీలించారు. ఆలయంలో విగ్రహాలను జెసిబి తో ధ్వంసం చేసి అనంతరం ఆ విగ్రహాలను చెత్త తరలించే డంపింగ్ వాహనాల్లో తరలించడం దారుణమని జనసేన నేత పోతిన మహేష్ అన్నారు.


వెంటనే ఆలయంలో విగ్రహాలను పునరుద్ధరించి సంబంధిత అధికారులపై చర్య తీసుకోకుండా ఉంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పోతిన మహేష్ హెచ్చరించారు. అరాచకానికి అంతులేని నిర్లక్ష్యానికి నిదర్శనమే ఈ ఆలయం ధ్వంసం చేసిన సంఘటన అన్న పోతిన మహేష్..  ఇంత తతంగం జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే చోద్యం చూస్తూండటం దారణమన్నారు. ఈ ప్రాంతంలో తిరిగి మళ్ళీ విగ్రహాలను ప్రతిష్టించే వరకు స్థానికులకు అండగా ఉండి పోరాటం చేస్తామని పోతిన మహేష్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

JCB