భార్య భర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు... అందరి ఉపాద్యాయ దంపతులకు వర్తించడం లేదని ఉపాధ్యాయ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం స్కూల్ అసిస్టెంట్ ఉపాద్యాయ దంపతులకు మాత్రమే బదిలీలు చేపట్టి... ఎస్జీటీ, లాగ్వేజ్ పండితులు, పీఈటీ ఉపాద్యాయుల దంపతులకు చేయడం లేదని ఉపాధ్యాయ దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని లకిడికపుల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయ దంపతులు వాపోయారు.


19జిల్లాల్లో బదిలీలు ఏ విధంగా చేశారో  అదే విధంగా నిలిపి వేసిన 13 జిల్లాల భార్య భర్త లకు బదిలీలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఉపాధ్యాయ దంపతులు అంటున్నారు.  సంవత్సర కాలంగా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తమ బాధ, ఆవేదన ను తెలియజేశామని.. ఇప్పుడు మళ్లీ 615 మంది స్కూల్ అసిస్టెంట్ లకు బదిలీలు నిర్వహించి... 1600 మందికి బదిలీలు నిలిపి వేయడం న్యాయమా  అని ఉపాధ్యాయ దంపతులు ప్రశ్నించారు. రెండు నుంచి ఐదు వందల కిలో మీటర్ల దూరం భార్య భర్తలు పని చేయడం వల్ల అనేక బాధలు పడుతున్నామని... 15 రోజుల ఒక్కసారి తన భర్తను కలుస్తున్నామని ఉపాధ్యాయ దంపతులు వాపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr