మే లేదా ఆగస్టులోనో సీఎం కార్యాలయాన్ని తరలిస్తామని ముఖ్యమంత్రి జగన్ తమకు చెప్పారని.. మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాజధాని గురించి సీఎం జగన్ కొత్తగా ఏమీ చెప్పలేదని.. మూడు రాజధానులకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని.. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరతామని మాజీ మంత్రి కొడాలి నాని  అన్నారు. మూడు రాజధానులపై  సుప్రీంకోర్టు లోనూ మాకు అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నామన్న మాజీ మంత్రి కొడాలి నాని .. రాష్ట్రానికి బిల్లు పెట్టే అధికారం లేదని సుప్రీం చెబితే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి బిల్లు పెట్టిస్తామన్నారు.


రాజధానిపై ఒకసారి బిల్లు పెట్టారని.. మరో సారి చేసేందుకు వీల్లేదంటే కేంద్రం ద్వారా బిల్లు పెట్టిస్తామని.. మాకు 175  అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు వస్తే మే కోరినట్లు కేంద్రం చేయక ఏం చేస్తుందని మాజీ మంత్రి కొడాలి నాని  ప్రశ్నించారు. మా డిమాండ్ కు ఎవరు సహకరిస్తారో వచ్చే ఎన్నికల అనంతరం వారికే మద్దతిస్తామని.. మోదీ ఉండొచ్చు మరొకరు ఉండొచ్చు...రాష్ట్ర ప్రజల నిర్ణయాన్ని కాదనే హక్కు కేంద్రానికి ఎక్కడుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: