బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి బుగ్గన వాస్తవాలకు దూరంగా మాయా ప్రపంచం చూపించారని.. మాటలు కోటలు దాటుతూ, చేతలు గడప దాటట్లేదనటానికి నీటి పారుదల రంగంలో కేటాయింపులు-ఖర్చులే ఓ ఉదాహరణ అని.. నీటిపారుదల రంగానికి 4ఏళ్లలో రూ.10వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్  అన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతీ రంగానికి చేసిన కేటాయింపుల్లో 90శాతానికి పైగా ఖర్చు చేశామని.. వృద్ధి రేటు పెరిగితే ఆదాయం ఎందుకు పెరగడం లేదని.. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్  ప్రశ్నించారు.


వృద్ధి రేటు పెరిగినా విచిత్రంగా ఆదాయం తగ్గి.. అప్పులు పెరిగాయని.. జగన్ ఎకనమిక్స్ కోసం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ఎదురు చూస్తోందని.. జగన్ ఓసారి నేల మీద నడిస్తే ప్రజలకు ఇబ్బందులు వస్తాయని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్  అన్నారు. ఓసారి నడిచినందుకు ఏపీ చాలా ఇబ్బందులు పడుతోందని.. జగన్ నేల మీద నడిస్తే.. ప్రజలు పరదాలు చాటుకు పోతారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్  ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: