ఈరోజు అందరికీ విపరీతమైన టెన్షన్ పెరిగిపోతూ ఉండటంతో చాలామంది కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే మన వయస్సును మించి చూపిస్తూ ఏర్పడ్డ ఈ కంటి నల్ల వలుయాలు వల్ల మన ముఖ వచ్చస్సు తగ్గిపోతుంది. దీనితో మన కళ్ళ కింద ఏర్పడ్డ సర్కిల్స్ ను తొలగించు కోవడం కోసం రకరకాల క్రీమ్స్ ను లోషన్స్ ను వాడుతూ ఆడార్క్స్ సర్కిల్స్ నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. 

అయితే చిన్నచిన్న చిట్కాలతో ఈసమస్యల నుండి బయట పడవచ్చు. చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాలకు నిద్ర సరిగా లేకపోవడం కారణం అని భావిస్తూ ఉంటారు. కాని అదినిజం కాదు. అసలు కారణాలు తెలిస్తే ఎవరికైనా షాక్ కలుగుతుంది. ఈ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పేరెంట్స్ నుండి హెరిటిడీగా వచ్చే అవకాశం ఉంది.  అదేవిధంగా ఎగ్జిమా కూడా కళ్ల కింద నల్లటి వలయాలకు కారణం కావచ్చు. 

ఎగ్జిమా మాత్రమే డార్క్ సర్కిల్స్ కి కారణం కాకపోయినా.. దురద, రుద్దడం కారణంగా.. డార్క్ సర్కిల్స్ ఏర్పడే అవకాశం ఉంది. అలర్జీలు దురదకు కారణమవుతాయి. కళ్ల కింద చర్మం చాలా సున్నితంగా, పలుచగా ఉంటుంది. దురద వల్ల బ్లడ్ వెజెల్స్ లో వాపు వస్తుంది. అది కళ్ల కింద చర్మం పలుచగా ఉండటం వల్ల ముఖం అంతటిలోకి అక్కడి స్కిన్ మరింత డార్క్ గా మారుతుంది.

 కాబట్టి మన అలర్జీలను నివారించుకో గలిగితే ఈ డార్క్ సర్కిల్స్ వాటంతట అవే రూపు మాసిపోతాయి. ఈ సమస్య కోసం రకరకాల పెస్తులను లోషన్స్ ను అనవసరం.  అదేవిధంగా మనం రాసుకునే ఫేషియల్ క్రీమ్స్ మన చర్మ తత్వానికి సరిపడేవి కాకుండా రకరకాల క్రీములను ఉపయోగిస్తే ఈ డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉంది. సూర్యరశ్మి ఎక్కువగా తగల కుండా మన కంటికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ డార్క్ సర్కిల్స్ సమస్య మొదటిలోనే అరికట్టవచ్చును..


మరింత సమాచారం తెలుసుకోండి: