అందంగా ఉండడానికి, అందంగా కనబడటానికి రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అలాంటి వారి కోసం తప్పకుండా కొన్ని బ్యూటీ టిప్స్ అవసరం. ఇక్కడ ఇస్తున్న కొన్ని బ్యూటీ టిప్స్ పురుషులకు తప్పకుండా సహాయపడతాయి. అయితే ఈ టిప్స్‌ను పాటించడానికి ఓ పార్లర్ కావాలి. ప్రస్తుతం నగరాలలో మగవారి కోసమే ప్రత్యేకమంటూ పార్లర్లు కూడా ఏర్పడ్డాయి. కొంత మందిలో పొడవుగా పెరిగే హెయిర్‌తో వారిలో అందం రెట్టిపు అవుతుంది. పురుషుల ముఖంపై కూడా మొటిమలు ఏర్పడవచ్చు. దీంతో మరింత స్కిన్ కేర్ తీసుకోవాలని కోరుకుంటారు.  ఒక్క మహిళలకు మాత్రమే బ్యూటీ టిప్స్ ఉన్నాయనుకోకుండా పురుషులకు కూడా తమ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి తగిన బ్యూటీ టిప్స్ ఉన్నాయి. చర్మాన్ని తరచూ శుభ్రపరుచుకుంటుండాలి. చర్మాన్ని శుభ్రపరుచుకోవడానికి కొన్ని టెక్నిక్స్ తెలిసి ఉండాలి. సాధారణంగా చాలా మంది చర్మం జిడ్డుగా ఉంటుంది. అలాగే వారి ముఖంలో ఓపెన్ రంధ్రాలు ఉంటాయి. ఎక్కువ బయట తిరగడంతో దుమ్ము, ధూళి ముఖ రంద్రాల్లో చేరి ముఖంలో మొటిమలు, ముడతలు ఏర్పడడానికి దారితీస్తుంది. కాబట్టి ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించడం మంచిది. మంచి బ్రాండ్ కలిగిన మన్నికైన క్రీములను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రతీ రోజు ఇంటికి తిరిగి రాగానే ముఖాన్ని మంచినీళ్లతో శుభ్రపరుచుకొని క్లెన్సింగ్ అప్లై చేయడం చాలా మంచిది. - అతి తక్కువ రసాయనాలు కలిగిన ఫేస్ వాష్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. - రోజుకు కనీసం మూడు సార్లైనా క్రీమ్‌తో ఫేస్‌వాష్ చేసుకోవాలి - సబ్బు, డియోడంట్స్ ఉత్పత్తులకు సంబంధించిన ఉత్పత్తులను ముఖానికి వాడకపోవడం మంచిది. -ముఖ్యంగా చర్మం రఫ్‌గా ఉంటుంది కాబట్టి అందుకోసం విటమిన్ ఈ ప్రొడక్ట్స్‌ను లేదా ఆలో తయారైన ఫేష్ వాష్‌లతో శుభ్రం చేసుకోవాలి - షేవింగ్ చేసిన తర్వాత ఆలో (కలబంద) ఫేష్ వాష్ చేసుకుంటే షేవింగ్ సమయంలో చిన్న గాట్లు ఏర్పడ్డా ఎటువంటి మచ్చలేకుండా ఉంటుంది. - వ్యాజ్‌పూన్‌ను తరచూ పెదవులకు రాస్తుండాలి. - ముఖం మరీ గరుకుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా పార్లర్‌కి వెళ్లి ఒకటి రెండు సార్లు వారి సలహాలను, పద్దతులను పాటించాలి. - ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మొటిమలు, ముడతలు, రంధ్రాలు పోయి ముఖం ఆకర్షణీయంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: