సాధార‌ణంగా ఎవ‌రికైనా తాము అందంగా క‌నిపించాల‌ని, మంచి టోన్ రావాల‌ని, ఎలాంటి మ‌చ్చ‌లు, మొటెమ‌లు రాకుండా ఉండాల‌ని అనుకుంటారు. దీని అనేక ప్ర‌యోగాలు కూడా చేస్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే చ‌ర్మ ర‌క్ష‌ణ కోసం వివిధ మార్గాలను అనుసరిస్తుంటాము. వాటిలో కొన్ని మన చర్మానికి మంచి చేస్తే కొన్ని హాని కలిగిస్తాయి. అయితే అందం సంరక్షణ కోసం నిమ్మరసంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దీని వల్ల చర్మానికి దుష్ప్రభావలు కూడా ఉన్నాయన్న విషయం మీరు తెలుసుకోవాలి.

 

అవును.. మీరు విన్న‌ది నిజ‌మే. వివిధ రకాల చర్మ సమస్యలను నివారించుకోవడంలో తరచుగా దీన్ని ఉపయోగిస్తుంటారు. కొన్ని సార్లు ఇది వ్యతిరేఖ ఫలితాలను చూపుతుంది. ఎందుకంటే నిమ్మరసంలో ఆమ్లగుణం అధికంగా, పిహెచ్ స్థాయిలు చాలా తక్కువగా ఉండటం వల్ల దీన్ని నేరుగా మీరు మీ ముఖం పై ఉపయోగించినప్పుడు ఇది చర్మంలో కొన్ని స‌య‌స్య‌లు క‌ల‌గ‌చేస్తుంది. నిమ్మ‌ర‌సం చర్మాన్ని మరింత పొడిగా చేసే శక్తిని కలిగి ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్న వారు దీన్ని ఉపయోగించడం వల్ల చర్మాన్ని మరింత పొడిగా చేస్తుంది.

 

అలాగే నిమ్మరసం జిడ్డుగల చర్మంలో సమస్యలను పెంచుతుంది, చర్మంలో దద్దుర్లు, బొబ్బలు ఏర్పడటానికి కారణం అవుతుంది. నిమ్మరసంలో అసిడ్ ఆమ్లం అధికంగా ఉంటుంది మరియు తరచూ చర్మంలో ఉపయోగించడం వల్ల ఇది దురదకు కారణమవుతుంది. చర్మంపై ఇటువంటి దుష్ప్రభాలు కలిగించడం వల్ల చివరికి కొంతకాలం తర్వాత చర్మంలో చాలామార్చులు వస్తాయి. అందుకే నిమ్మ‌ర‌సం ఉప‌యోగిస్తున‌ప్పుడు అసౌక‌ర్యంగా అనిపిస్తే దీనికి దూరం ఉండ‌డ‌మే బెట‌ర్‌. మ‌రియు నిమ్మ‌ర‌సం ఎక్కువ‌గా తాగితే క‌డుపులో యాసిడ్ల శాతం పెరుగుతుంది. దీంతో క‌డుపు మంట,  గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు నొప్పి వంటివి కూడా వ‌స్తాయి. 

 
  

మరింత సమాచారం తెలుసుకోండి: