పెసరపిండి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. పెస‌లు నుంచి వ‌చ్చే ఈ పెస‌ర‌పిండితో ఎన్నో వంట‌లు చేస్తుంటారు. ఇందులో  ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే పెస‌ర‌పిండి వంట‌ల‌కే కాకుండా చ‌ర్మానికి కూడా గ్రీట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. కాని, చాలా మందికి పెస‌ర‌పిండిని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలో అవ‌గాహ‌న ఉండ‌క‌పోవ‌చ్చు. అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే ఖ‌చ్చితంగా ఫాలో అయితే చ‌ర్మాన్ని మ‌రింత మెరిపించుకోవ‌చ్చు.

 

అందుకు ముందుగా పెసరపిండిలో కొద్దిగా పాలు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ మాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత కడిగేయడం వల్ల ముఖంపై ఉన్న మలినాలు తొలగిపోయి ముఖం తాజాగా ఉంటుంది. అలాగే పెసరపిండిలో ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఈ మిశ్రామన్ని ముఖానికి రాసుకుని పావు గంట‌ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖంపై మొటిమ‌లు త‌గ్గ‌డ‌మే కాకుండా.. కాంతివంతంగా కూడా మారుతుంది.

 

అదేవిధంగా, అరటీస్పూన్ పెసరపిండిలో రెండు టీస్పూన్ల ఆమ్లా జ్యూస్ ను మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పెసరపిండిలో ఉండే ప్రోటీన్ కంటెంట్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టును స్ట్రాంగ్ గా ఉంచుతుంది. మ‌రియు పెసరపిండి, వేప నూనెను కలిపి బాగా మిక్స్ చేసి త‌ల‌కు ప‌ట్టించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ చుండ్రుతో బాధపడేవారికి మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: