ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. కరోనా వల్ల రోజులు ఇప్పుడు చాలా దారుణంగా మారాయి. బయటకి వెళ్ళేటప్పుడు కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో మన ముఖ సౌందర్యం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మన ముఖాన్ని కాపాడుకునే బాధ్యత చాలా వుంది. చాలా మంది ముఖ సౌందర్యం కోసం చాలా కష్టపడుతూ వుంటారు. కాని ఎలాంటి ఫలితాలు వుండవు. మితి మీరిన మొటిమలు, మచ్చ లతో అందవిహీనంగా కనపడుతూ వుంటారు. చాలా మంది డాక్టర్లని కలుస్తూ వుంటారు. అనేక రకాల మందులు వాడుతూ వుంటారు. కాని వాటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అంతకు ముందు ఉన్నట్టు ఉత్పత్తులు అందుబాటులో ఉండటం లేవు. కొన్ని అందుబాటులో వున్న వాటి కోసం బయటికి వెళ్ళడానికి చాలా మంది సంకోచిస్తారు.అలాంటి వారి కోసం ఇంట్లోనే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకునే చిట్కాలు. తప్పకుండా పాటించండి. నిత్యం అందంగా ఆకర్షణీయంగా ఉంటారు.
తేనె వల్ల చర్మానికి సరికొత్త మెరుపు వస్తుంది. రోజుకు రెండుసార్లు ముఖంపై అప్లై చేయాలి. కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. నిగనిగలాడే చర్మం కోసం నిమ్మకాయను కూడా వాడవచ్చు. నిమ్మకాయలో సహజసిద్ధమైన బ్లీచింగ్ లక్షణాల వల్ల ముఖంపై పేరుకుపోయిన మలినాలు తొలగుతాయి. దీని కోసం తరచూ నిమ్మరసాన్ని ముఖానికి అప్లై చేయాలి.ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలిగిపోవాలి అనుకుంటే కీరదోస ముక్కను తీసుకుని ముఖంపై మెల్లిగా రుద్దాలి. కొన్ని నిమిషాల తరువాత కీరదోసను తొలగించాలి.కంటి చుట్టూ ఉండే డార్క్ సర్కిల్‌ను తొలగించాలి అనుకుంటే కీరదోస ముక్కల్ని మూసిన కనురెప్పలపై కాసేపు ఉంచితే ప్రయోజనం ఉంటుంది.ముఖం మెరిసిపోవాలి అంటే తులసి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేయాలి. తరువాత నీళ్లు కలిపి ముఖానికి అప్లై చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. వారంలో ఫలితం కనిస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: