ఆ వంటింటి చిట్కాలు ఏంటో? వాటి ద్వారా మన జుట్టు రాలే సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
గ్రీన్ టీ:
గ్రీన్ టీ ని సాధారణంగా బరువు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు సరికొత్తగా జుట్టురాలే సమస్యను కూడా అరికడుతుందట.గ్రీన్ టీని కొద్దికొద్దిగా మాడుకు పట్టించి, సుతిమెత్తగా మర్దనా చేయాలి.ఇందువల్ల కుదుళ్ళలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. గ్రీన్ టీలో ఉండే ఈసీజీసీ గుణాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెను రోజు సరైన పద్ధతిలో వాడితే జుట్టు రాలడమే కాకుండా పొడిబారకుండా ఉంటుంది. మనలో చాలామందికి రోజూ తలస్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టుకు కొబ్బరి నూనె సరిగా పెట్టరు. కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. గోరువెచ్చని నూనెలు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి అని మనందరికీ తెలుసు. కాబట్టి సరైన పద్ధతిలో కొబ్బరి నూనె జుట్టుకు అందించడం ద్వారా జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు.
ఉల్లిపాయ:
ఉల్లిపాయ జుట్టు రాలే సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఉల్లిపాయ రసాన్ని కుదుళ్ళలో పట్టించి బాగా మర్దన చేయాలి. 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే,జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతిని వారానికి ఒకసారి పాటించడం వల్ల ఫలితం తొందరగా లభిస్తుంది.
కలబంద:
కలబంద గుజ్జును కుదుళ్ళలో పట్టించి, తలంటు పోసుకోవాలి.ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా చుండ్రుని కూడా నివారించగలిగే శక్తి కలబందకు ఉంది.
పసుపు:
పసుపు ముఖ్యంగా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంది. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలిపి త్రాగడం వల్ల మంచి నిద్రతో పాటు, ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.పసుపులో ఉండే కర్కుమిన్ అనే రసాయనం జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.
గుమ్మడి విత్తనాలు:
గుమ్మడి విత్తనాలు కూడా డ్రైఫ్రూట్స్ కోవకు చెందినవే.గొప్ప ఎంజైమ్లతో కూడిన గుమ్మడి విత్తనాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.
సోయా చిక్కుళ్ళు:
సోయా చిక్కుళ్ల ను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సమస్యలను కూడా దూరం చేస్తుంది. డయాబెటిస్ రోగులకు సోయా చిక్కుళ్ళు మంచి ఔషధంగా పనిచేస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి