అరటి తొక్కలో ఉండే పొటాషియం చర్మంపై మచ్చలను తొలగిస్తుంది.అరటి పండు తొక్కను మీ చర్మం మీద గుండ్రంగా రుద్దండి. ఇలా సుమారు 15 నిమిషాలు వరకు రుద్దండి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీన్ని వారంలో రెండుసార్లు చేస్తే చాలు. ముఖం మీద ఏర్పడిన పెద్ద రంథ్రాలు క్రమేనా మాయమవుతాయి.ముల్తానీ మట్టి కేవలం మొటిమలనే కాదు. చర్మం మీద ఏర్పడే రంథ్రాలను సైతం మాయం చేస్తుంది. ఇది చర్మం మీద ఉండే నూనెలను పీల్చుకుని పెద్ద రంథ్రాలు ఏర్పడకుండా కాపాడుతుంది. చర్మంలోని మృత కణాలను సైతం తొలగిస్తుంది. వారానికి ఒకసారి ముల్తాని మట్టి రాస్తే.. రంథ్రాలు బిగువుగా మారతాయి.ముల్తానీ మట్టిని మీ ముఖాన్నికి బాగా రాసుకోండి. అది ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.పసుపులోని సుగుణాలు గురించి మీకు తెలిసిందే. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు గల పసుపు గుంతల్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఫలితంగా రంథ్రాలు చుట్టూ ఏర్పడే వాపు తగ్గుతుంది.
ఓట్స్ మంచి బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే కాదు. చర్మ సంరక్షణకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓట్స్ చర్మం మీద ఉండే ఆయిల్‌ను గ్రహిస్తుంది. అలాగే రంథ్రాలు, గుంతల పరిమాణాన్ని తగ్గిస్తుంది.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్‌లో ఒక టేబుల్ స్పూన్ పాలు కలపండి. ఆ మిశ్రమాన్ని చర్మానికి రాయండి. బాగా ఆరిన తర్వాత మీ ముఖాన్ని కాసేపు రుద్దండి. అనంతరం చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి