మనం తీసుకునే ఆహారంలో పోషక విలువల లోపం కారణంగా, బయట ఎండ కారణంగా,  ఆందోళన,ఒత్తిడి, కాలుష్యం ఇవన్నీ మొటిమలకు కారణమవుతున్నాయి. ఈ  మొటిమల కారణంగా ముఖము చాలా అంద వికారంగా కనిపిస్తుంది. మొటిమలు తీవ్రమైన మానసిక పరిమాణాలను కలిగిస్తాయి. అంతేకాకుండా హార్మోన్ల మార్పుల వల్ల ముఖం మీద కనిపించే మొటిమలను తొలగించుకోవచ్చు..కానీ మొటిమల కారణంగా వచ్చే మచ్చలు మాత్రం  అక్కడే ఉంటాయి. మొటిమలకు ప్రధాన కారణం శరీరంలో సెబమ్ స్థాయిలు పెరగడం. మొటిమలు వదిలించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎటువంటి సౌందర్య సమస్యలకు అయిన మార్కెట్లో అనేక  చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లో సహజసిద్ధంగా ఈ మొటిమలను ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


మొటిమలకు నిమ్మ తొక్క, ఓట్స్ :
నిమ్మకాయ పై ఉండే తొక్క, అర కప్పు  ఓట్స్ అలాగే మూడు టేబుల్ స్పూన్ల చక్కెర తీసుకోవాలి. అన్నింటిని ఒక గిన్నెలో వేసి, మిశ్రమంలా తయారు చేయాలి. ఆపై  ముఖం మీద అప్లై చేసి, స్క్రబ్బింగ్ చేస్తూ, సుతి మెత్తగా మర్దనా చేయాలి. ఒక ఇరవై నిమిషాలు ఆరనిచ్చి ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఇలా రోజుకు ఒకసారి ఈ పద్ధతిని పాటించడం వల్ల మొటిమలు త్వరగా తగ్గిపోతాయి..


నిమ్మరసం, పండ్ల తొక్క :
పండ్ల తొక్కలను మెత్తగా పొడిచేసి, ఆ పొడిని ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. అందులో ఒక కాటన్ బాల్ అద్ది, ముఖం మీద ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో, ఆ మచ్చలు ఉన్న ప్రదేశంలో సుతిమెత్తగా అప్లై చేయాలి. ఒక పదిహేను నిమిషాలు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పద్ధతిని కూడా వారానికి నాలుగు సార్లు పాటించడంవల్ల మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియా తొలగించబడుతుంది.


పసుపు, పండ్ల తొక్క :
పండ్ల తొక్క పొడిని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు కలపాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖం మీద అప్లై చేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది..


ఇవే కాకుండా అరటి తొక్క, బేకింగ్ పౌడర్  కూడా మొటిమలు తగ్గించడానికి సహాయపడుతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: