నటీనటులు: అన్ష్ (అన్ష్ తోరట్), వాసవి గణేషన్, గోవర్ధన్ తదితరులు

దర్శకత్వం: బిక్షు (బిక్షు కొయ్యగుర)

సంగీతం: చరణ్ అర్జున్

నిర్మాత: కె. వెంకట్ యాదవ్

కథ:

పల్లెటూరి నేపథ్యంలో సాగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. పదో తరగతి పూర్తి చేసి ఊరిలో ఫస్ట్ మార్కులతో పాసైన రవి (అన్ష్) అనే కుర్రాడు, అదే గ్రామానికి చెందిన చిట్టి (వాసవి గణేషన్)తో ప్రేమలో పడతాడు. తెలిసీ తెలియని వయసు, చెడు స్నేహాలు, స్మార్ట్‌ఫోన్ల ప్రభావంతో హార్మోన్ల అదుపు తప్పి వీరిద్దరూ హద్దులు దాటుతారు.

ఈ విషయం రెండు కుటుంబాలకు తెలియడంతో పెద్ద గొడవ మొదలవుతుంది. ఆ తర్వాత ఆ రెండు కుటుంబాల జీవితాలు ఎలా మలుపు తిరిగాయి? పిల్లలు చేసిన పొరపాటు వల్ల తల్లిదండ్రులు ఎలాంటి వేదన అనుభవించారు? చివరికి రవి-చిట్టిల కథ ఏ తీరానికి చేరిందనేదే ఈ సినిమా అసలు ముగింపు.

విశ్లేషణ :

ఫస్టాఫ్ పూర్తిగా యూత్‌ఫుల్ హంగామా, డబుల్ మీనింగ్ కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. టీనేజ్‌లో వచ్చే ఆలోచనలు, స్నేహితుల ముచ్చట్లు కుర్రాళ్లను థియేటర్‌లో విజిల్స్ వేయిస్తాయి. ఇంటర్వెల్ కార్డు పడ్డాక సినిమా అసలు రంగు మారుతుంది. కేవలం అడల్ట్ కామెడీ కోసమే అనుకున్న సినిమాలోకి బలమైన ఎమోషన్, కుటుంబ బాధ్యతలు వచ్చి చేరుతాయి.

ప్రస్తుతం పిల్లలపై స్మార్ట్‌ఫోన్లు, చెడు సావాసాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో దర్శకుడు చాలా ధైర్యంగా, బిడియం లేకుండా తెరపై ఆవిష్కరించాడు. పేరెంట్స్ మరియు టీనేజర్లు అందరూ తప్పక చూడాల్సిన కంటెంట్ ఇది.

కొత్తవారైనప్పటికీ అన్ష్, వాసవి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రొమాంటిక్ సీన్స్ ఎంత బోల్డ్‌గా చేశారో, ఎమోషనల్ సీన్స్‌లో కూడా అంతే బాగా కంటతడి పెట్టించారు. తండ్రిగా గోవర్ధన్ నటన సినిమాకు ప్రాణం పోసింది. చరణ్ అర్జున్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథలోని ఎమోషన్‌ని బాగా ఎలివేట్ చేసింది. గ్రామీణ వాతావరణాన్ని కలర్‌ఫుల్‌గా కెమెరాలో బంధించారు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే రన్‌టైమ్ మరింత క్రిస్పీగా ఉండేది.

ప్లస్ పాయింట్స్ :

 నవ్వులు పూయించే కామెడీ

 బలమైన మెసేజ్ & ఎమోషన్

లీడ్ పైర్ రొమాన్స్ & యాక్టింగ్

మైనస్ పాయింట్స్

ఎడిటింగ్‌లో కొన్ని లాగ్స్

చివరిగా పైకి బోల్డ్ అండ్ వినోదాత్మకంగా అనిపించినా, లోపల ఒక మంచి హెచ్చరిక లాంటి సందేశాన్ని దాచుకున్న చిత్రం 'హుషార్ పిట్టలు'. యూత్‌కి వినోదం అందించడంతో పాటు తల్లిదండ్రులకు ఒక మంచి కంటివిప్పు లాంటి సినిమా!

రేటింగ్ : 3.0/5.0

మరింత సమాచారం తెలుసుకోండి: