ఆప్రికాట్‌లో విటమిన్లు ఇంకా మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఏ, ఐరన్ ఇంకా విటమిన్ సీ పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి కావాల్సిన అనేక రకాల న్యూట్రీషియన్స్ అందిస్తుంది. అలాగే పలు రకాల వ్యాధులను కూడా నివారిస్తోంది.ఇది కేవలం పండు మాత్రమే కాదు, డ్రై ఆప్రికాట్‌ కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేస్తుంది. ఈ డ్రై ఆప్రికాట్ జ్యూస్ తీసుకుంటే చర్మ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఎక్జిమా, దురద ఇంకా తామర వంటివాటిని నివారించి కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. దాహార్తి సమస్య ఉన్న వారుకి కూడా చాలా మంచి సొల్యూషన్ లభిస్తుంది.ఎండిన ఆప్రికాట్ లో అధిక న్యూట్రీషియన్స్ విటమిన్ ఏ అధికంగా ఉండి కంటి చూపునకు కూడా చాలా బాగా సహాకరిస్తుంది. ఈ డ్రై ఆప్రికాట్ పెద్ద పేగులను శుభ్రపరచి అందులో నిల్వ ఉన్న వ్యర్థాలను బయటకు పంపించడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే మజిల్ ఫంక్షన్స్, హార్ట్ బీట్ ను రెగ్యులేట్ చేస్తుంది.ఈ అప్రికాట్ పూర్తి స్థాయిలో ఫైబర్ కంటెంట్ కలిగి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో మీ గుండె ఆరోగ్యంగా ఉండేందుకు కూడా సహకరిస్తుంది.


ఆప్రికాట్ మంచి కొలెస్ట్రాల్ను పెంచుతూ, ఇంకా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో దోహదపడుతుంది. ఇక అంతేకాకుండా ఈ పండులో ఉండే పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.ఆప్రికాట్‌లో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైటోన్యూట్రియంట్స్ ఆరోగ్యవంతమైన ఇంకా మృదువుగా ఉండే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. ఆప్రికాట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వృద్దాప్య చాయలను కూడా దరిచేరనీయవు. తామర ఇంకా చర్మం దద్దుర్లు వంటి ఇతర చర్మ సంబంధ వ్యాధులకు చికిత్సగా పనిచేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్‌ను కూడా ఈజీగా దూరం చేస్తుంది. కావున, తరచుగా మీ ఆహారంలో ఆప్రికాట్ చేర్చుకోవటం చాలా ఉత్తమంగా చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: