కొందరు మహానుభావులు తాము అనుకున్న పనిని సరిగ్గా చేయలేరు. ఉదాహరణకు ఉదయం నుంచే వాకింగ్ రన్నింగ్, యోగా చేసేందుకు రాత్రి నిద్రకు ముందే ప్లాన్ చేసుకుంటారు. ఉదయం కాగానే ఆ మహానుభావులు బద్ధకంతో రాత్రి అనుకున్న ప్లాన్‌ను పక్కన పెట్టేస్తారు. ఈ రోజు కాదు మరో రోజు అనుకుంటూ అలానే మజ్జుగా నిద్రపోతారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం కూడా చేయాలి. అయితే వ్యాయామం అన్నింటిలోనూ చాలా తేలికైంది. ఖర్చు అస్సలు ఉండదు.. ఇందులో జిమ్ కాకుండా వాకింగ్‌ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. రోజూ వాకింగ్ చేయడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.బరువు పెరగడం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. బరువును నియంత్రించుకోవడానికి ప్రజలు రకరకాల పద్ధతులను అవలంబిస్తారు. డైట్ కంట్రోల్ చేయడం నుంచి మొదలు గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్ చేసినా బరువు తగ్గరు. అయితే ఇలా కొన్ని రోజులు జిమ్‌లో వర్కవుట్ చేసి.. ఆ తర్వాత జిమ్ మొత్తం మానేస్తారు.


అయితే బరువు తగ్గడానికి జిమ్‌లో వర్కవుట్ చేయనవసరం లేదని, రెగ్యులర్‌గా నడవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.ఇక బరువు తగ్గడానికి, నడక, ఆహారం తీసుకునే సమయం, తీవ్రత చాలా ముఖ్యమైనవి. మీరు శారీరక శ్రమ చేయడం. కేలరీలను తగ్గించడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. నడక అనేది కేలరీలను సులభంగా బర్న్ చేసే ఒక చర్య. మీరు ప్రతిరోజూ అరగంట పాటు వేగంగా నడిస్తే, మీరు బరువును సులభంగా నియంత్రించవచ్చు. మీరు రోజుకు 30 నిమిషాల పాటు నడవడం ద్వారా దాదాపు 150 కేలరీలు బర్న్ చేయవచ్చు. క్రమం తప్పకుండా నడవడం ద్వారా కూడా బరువు తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. జర్నల్ ఆఫ్ ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ అండ్ బయోకెమిస్ట్రీలో ఒక అధ్యయనం ప్రకారం.. నడక శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. నిరంతరం నడవడం వల్ల పొట్ట, నడుము కొవ్వు తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: