మెంతులని నీటిలో వేసి మరిగించి అవి చల్లారిన తర్వాత వడగట్టిన నీటిని మొటిమలపై ప్రతి రోజూ రాస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టిన మెంతి గింజలను తీసుకొని వాటిని గ్రైండ్ చేయండి. తరువాత దీనికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలపండి. ఇక వీటిని బాగా కలిపిన తర్వాత ముఖానికి రాసుకోవచ్చు.ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇది టాక్సిన్స్ తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇక మెంతులను నానాబెట్టి గ్రైండ్ చేయగా తయారైన మొత్తటి మిశ్రమాన్ని ముఖంపై రుద్దడం వల్ల ముఖ చర్మం బిగుతుగా మారుతుంది. ముఖంపై ముడతలు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. మనం కోల్పోయిన యవ్వనాన్ని పునరుద్ధరించడంలో మెంతులతో తయారు చేసిన ప్యాక్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. అందమైన చర్మాన్ని సొంతం చేసుకోండి.మెంతులతో ఇలా చేస్తే మెరిసిపోవడం ఖాయం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి