తల స్నానానికి షాంపులను వాడడం తేలికగా ఉన్నప్పటికి వీటిని వాడడం వల్ల ఎటువంటి మేలు కలదు.అలాగే వీటిని వాడటం వల్ల మనం అనేక రకాల దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే జుట్టును శుభ్రం చేసుకోవడానికి షాంపులకు బదులుగా కుంకుడకాయలను వాడడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కుంకుడు కాయలను వాడడం వల్ల జుట్టు మురికి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే మన తలలో ఉండే బ్యాక్టీరియా, వైరస్, క్రిములు నశిస్తాయి. ఇంకా అంతేకాకుండా తలలో పేల సమస్య నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. అలాగే చుండ్రు సమస్య తగ్గుతుంది. తల స్నానానికి కుంకుడుకాయలను వాడడం వల్ల జుట్టు కుదుళ్లు చాలా బలంగా తయారవుతాయి. ఇంకా జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని వాడడం చాలా మంది ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు.అయితే ఇలాంటి వారు కుంకుడుకాయల పొడి వాడడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా మంచి ఫలితం ఉంటుంది.


కుంకుడుకాయలను తీసుకొని వాటి లోపల ఉండే గింజలను పగలకొట్టాలి. ఆ తరువాత గింజలపై ఉండే నల్లటి పొట్టును తీసేసి కుంకుడుకాయలను గింజల లోపల ఉండే పప్పును ఎండలో పెట్టాలి. ఆ తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకుని జల్లించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కుంకుడుకాయ పొడిని స్టోర్ చేసుకోవాలి.ఇంకా ఈ పొడిని తలస్నానం చేసే ముందు వేడి నీటిలో వేసి నానబెట్టి ఆ నీటితో తలస్నానం చేయవచ్చు.లేదంటే ఈ పొడిని నేరుగా జుట్టుపై వేసుకుని కూడా తలస్నానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కుంకుడుకాయలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సులభంగా తలస్నానం చేయవచ్చు.ఇక షాంపులకు బదులుగా కుంకుడుకాయలతో ఈ విధంగా తలస్నానం చేయడం వల్ల జుట్టుకు చాలా మేలు కలుగుతుంది. ఇక ప్రయాణాల్లో లేదా సమయం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే షాంపులతో తలస్నానం చేయాలని షాంపులను వాడి మిగతా టైంలో వీలైనంత వరకు తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: