ఏప్రిల్ 22 వ తేదీన ఒక్కసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం  రండి. 

 

 ఇమాన్యుల్ కాంట్ జననం : ప్రముఖ జర్మన్ బావవాద తత్వవేత్త అయిన ఇమాన్యుల్ కాంట్ 1724 ఏప్రిల్ 22వ తేదీన జన్మించారు, ఇతను భావవాదం జడ తత్వశాస్త్రంపై ఎక్కువగా మొగ్గు చూపాడు. ఈయన అన్ని సందర్భాలలో జడత్వ వాదానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇతని ప్రభావం  కార్ల్ మర్క్స్ పైన కూడా పనిచేస్తూ ఉంటుంది. 

 

 లెనిన్ జననం : లెనిన్  అనే పేరుతో సుప్రసిద్ధుడైన రష్యా విప్లవ నాయకుడు. 1970 ఏప్రిల్ 22 వ తేదీన జన్మించారు. కమ్యూనిస్టు రాజకీయ వేత్త అయిన ఈయన 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం లో ప్రధాన నాయకుడు. రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా  రష్యా దేశానికి మొదటి అధినేత లెనిన్. 1922 వరకు ఆ పదవిలో కొనసాగారు . కార్ల మార్క్స్ ప్రతిపాదించిన మార్కిజం కు అతడు కూర్చుకున్న  మార్పులతో కలిపి ఆ సిద్ధాంతం లేనినిజం లేదా మార్క్సిజం-లెనినిజం అని అంటారు. ఎన్నో  విప్లవ కార్యక్రమాలలో పాల్గొని ముందుండి నడిపించాడు . ముఖ్యంగా దేశ బహిష్కరణ కు కూడా కూడా గురయ్యాడు. 

 

 అంజని బాయి మాల్పేపర్ జననం : ప్రముఖ భారతీయ సాంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి అయిన అంజలి భాయ్ మాల్పేపర్ 1883 22వ తేదీన జన్మించారు హిందుస్థానీ సంగీతంలో బెండి  బజార్ ఘరానా శైలికి చెందింది . అంజలి భాయ్ మాల్వేపర్ నజీర్ ఖాన్ శిష్యురాలు. ఎనిమిదవ ఏట నుంచి సంగీతంలో శిక్షణ తీసుకున్నా అంజలి భాయ్ ఈ భారతీయ సాంప్రదాయ సంగీత కళాకారిణిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ముంబైలో పదహారవ యేట ప్రొఫెషనల్ కెరియర్ ప్రారంభించింది అంజలి భాయ్. 1920 వరకు ఆమె సంగీత కలలో  చాలా బాగా సాగింది. ఇక ఆ తర్వాత ఆమె గురువు చనిపోవడంతో ప్రజా ప్రదర్శనలకు దూరంగా ఉంది అంజలి భాయ్. 1923 తర్వాత పూర్తిగా ప్రదర్శనలు ఇవ్వడం మానిన అంజలి n బాయ్. ఇక అప్పటి నుంచి తన శిష్యులకు శిక్షణ ఇవ్వడం లో మునిగిపోయింది. 

 

 శీలా వీర్రాజు జననం  : చిత్రకారుడిగా కవిగా కథా రచయితగా నవల రచయితలు బహుముఖ ప్రతిభను ప్రదర్శించిన శీలా వీర్రాజు 1939 22వ తేదీన జన్మించారు. 1991 హైదరాబాద్ నుండి వెలువడే కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్గా చేరారు రెండేళ్ళు పని చేసిన ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ లో కూడా పని చేసి  స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. చిత్రకారుడిగా కవితా కథా రచయితగా నవల రచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు శీలా వీర్రాజు. ఇక ఈయన రాసిన ఎన్నో కవితలు ఎంతగానో ప్రజాదరణ పొందాయి. నవలలు కూడా ఎంతగానో ప్రజాదరణ పొందడంతో ఈయనకు  మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చాయి. 

 

 

 దగ్గుబాటి పురందేశ్వరి జననం  : భారత పార్లమెంటు సభ్యురాలు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి భారత కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన దగ్గుబాటి పురందేశ్వరి 1959 ఏప్రిల్ 22వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించిన గొప్ప నటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి. ప్రస్తుతం దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపి పార్టీలో కొనసాగుతున్నారు. బిజెపి పార్టీలో కీలక నేతగా ప్రతిపక్ష నేతగా ఉన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: