మే 2వ తేదీన ఒకసారి చరిత్రలో ఒకసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి . మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈరోజ  జన్మించిన  ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 

 

 

 పి.పుల్లయ్య జననం : తెలుగు చిత్ర నిర్మాత దర్శకుడు అయిన పి.పుల్లయ్య 1911 మే రెండవ తేదీన జన్మించారు. మొదటి తరం చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు పి.పుల్లయ్య. ఈయన సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ ద్వారా నిర్మించారు . ఈయన సతీమణి తెలుగు సినీ నటి విజయ కుమారి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు పి.పుల్లయ్య. మరోవైపు నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా తన సత్తా చాటారు. తొలి తరం దర్శకులు నిర్మాతలలో  బాగా ప్రసిద్ధి చెందిన వారిలో ఈయన  ముందు వరుసలో ఉంటారు.

 

 సత్యజిత్ రే జననం : భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ సినీ దర్శకుడు రచయిత సత్యజిత్ రే ప్రపంచ సినిమాల్లో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుడుగా  పేరుగాంచారు. ఈయన 1921 మే రెండవ తేదీన జన్మించారు.  ప్రముఖ బెంగాలీ కళాకారుల కుటుంబంలో జన్మించిన సత్యజిత్ రే ... సినిమాలు లఘుచిత్రాలు డాక్యుమెంటరీలు కలిపి మొత్తం 37 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా పథేర్ పాంచాలి కేన్స్ చలన చిత్రోత్సవంలో 11 అంతర్జాతీయ బహుమతులను గెలుచుకున్నది . ఆయనకు కేవలం దర్శకత్వంలోనే కాదు  సినిమా  లోని  ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో  దాదాపు అన్ని రంగాలలో ఆయన ఎన్నో ముఖ్య పనులు చూసుకునే వారు. కేవలం సినిమాలు తెరకెక్కించడం కాదు ఎన్నో పుస్తకాలు వ్యాసాలు కూడా రాశారు.

 

 కోడెల శివప్రసాద్ జననం : తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి అయిన కోడెల శివప్రసాద్ 1947 మే 2వ తేదీన జన్మించారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఆనాడు ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు హయాం వరకు పార్టీలో కీలక నేతగా ఎదుగుతూ ఎన్నో కీలక పదవులను అలంకరించారు కోడెల శివప్రసాద్ రావు. ఆంధ్ర రాజకీయాలలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించారు. ఇక తనపై కేసులు ఎక్కువైన కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు కోడెల శివప్రసాద్ .

 

 బ్రియాన్ లారా జననం : వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ అయినా బ్రియాన్ లారా  గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కొసమెరుపు. వెస్టిండీస్ క్రికెట్ లో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి ఎన్నో రికార్డులు నెలకొల్పిన గొప్ప ఆటగాడు బ్రియాన్ లారా. కాగా బ్రియాన్ లారా  1969 మే రెండో తేదీన జన్మించారు.

 

 దేవిక జననం : అందాల తారగా తెలుగు తమిళ సినీ రంగంలో ఎంతగానో గుర్తింపు  సంపాదించి ఓ వెలుగు వెలిగిన కథానాయక దేవిక. తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఏకంగా 150కి పైగా సినిమాల్లో నటించింది. బ్రియాన్ లారా  1943 మే 2వ తేదీన జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: